రికార్డు స్థాయికి చేరిన ఇంధన ధరలు.. మరోసారి పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

Petrol, Diesel Rates Hiked Again On Tuesday; Petrol Nears ₹ 101 In Mumbai

Petrol, diesel prices hiked after day’s gap. Check latest rates

దేశంలో ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరాయి. గురువారం లీటర్‌ పెట్రోల్‌పై 26 పైసలు, డీజిల్‌ లీటర్‌కు 7 పైసల వరకు పెంచాయి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.101.60.. డీజిల్‌ రూ.96.25 లకు చేరింది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.76, డీజిల్‌ రూ.88.30కి పెరిగింది.

ఆర్థిక రాజధాని ముంబై నగరంలో పెట్రోల్‌ రూ.103.89కు చేరింది.  విజయవాడలో పెట్రోల్‌ రూ.103.53, డీజిల్‌ రూ.97.61 కాగా రాజస్థాన్‌లో ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌ రూ.108.94, డీజిల్‌ రూ.101.48 పలుకుతోంది. ఇప్పటి వరకు మే 4 తర్వాత నుంచి ఇప్పటి వరకు 30 సార్లు ధరలు పెరగ్గా.. లీటర్‌ పెట్రోల్‌పై రూ.7.44, డీజిల్‌పై రూ.7.52 పెరిగింది.