ఉగ్రవాదులకు నిధుల కేసు. యాసిన్‌ మాలిక్‌ ను దోషిగా తేల్చిన ఎన్‌ఐఏ

ఉగ్రవాదులు, ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో కశ్మీరీ వేర్పాటువాద నేత యాసిన్‌ మాలిక్‌ ను ఢిల్లీలోని ఎన్‌ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) దోషీగా తేల్చింది. ఈ మేరకు ఇవాళ ఎన్‌ఐఏ  కోర్టు తీర్పు వెలువరించింది. మాలిక్‌ ఇటీవల తన నేరాన్ని అంగీకరించడంతో న్యాయస్థానం అతడిని దోషిగా తేల్చింది. మే 25న అతడికి శిక్ష ఖరారు చేయనున్నట్లు తెలిపింది.

2017లో కశ్మీర్‌ లోయలో ఉగ్రవాదం, వేర్పాటువాద కార్యకలాపాలకు సంబంధించిన కేసులో మాలిక్‌పై ఎన్‌ఐఏ కోర్టు కేసు నమోదు చేసింది. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద, చట్టవ్యతిరేక కార్యకలాపాల కోసం మాలిక్‌.. ‘ఫ్రీడమ్‌ స్ట్రగుల్‌’ పేరుతో నిధుల సమకూర్చాడని దర్యాప్తులో తేలింది. మాలిక్‌తో పాటు లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ చీఫ్‌ సయ్యద్‌ సలాహుద్దీన్‌లపై కూడా ఎన్‌ఐఏ ఛార్జ్ షీట్‌ దాఖలు చేసింది.