మహారాష్ట్ర అంబర్నాథ్లో ఓ రసాయన పరిశ్రమలో గ్యాస్ లీక్ అయిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 34 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరంతా ఉల్లాస్నగర్లోని సెంట్రల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని థానే మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతీయ విపత్తు నిర్వహణ సెల్ చీఫ్ సంతోష్ కదం చెప్పారు.
అంబర్నాథ్లోని మహారాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (MIDC)లో ఉన్న ఓ ప్లాంట్ నుంచి ఉదయం 10 గంటల సమయంలో సల్ఫ్యూరిక్ యాసిడ్ లీక్ అయింది. దీనితో పరిశ్రమ సమీపంలో నివసిస్తున్న స్థానికులు ఊపిరి ఆడకపోవడం, కళల్లో మంట, వికారం, ఇతర ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని, గ్యాస్ లీక్ కాకుండా చర్యలు చేపట్టారు. లీకేజీకి గల కారణాలు తెలుసుకునేందుకు విచారణ జరుపుతున్నట్లు సంతోష్ కదం చెప్పారు.