జులై-సెప్టెంబ‌ర్‌లో దూసుకుపోయిన జీడీపీ

India-GDP-Growth-Rate

దేశ ఆర్ధిక వ్య‌వ‌స్ధ క్ర‌మంగా పుంజుకుంటోంది. 2021-22 ఆర్ధిక సంవ‌త్స‌రం రెండో త్రైమాసికం(జులై-సెప్టెంబ‌ర్)లో అంచ‌నాల‌కు అనుగుణంగా భార‌త జీడీపీ 8.45 శాతం వృద్ధి క‌న‌బ‌రిచింది.

గ‌త ఏడాది ఇదే క్వార్ట‌ర్‌లో మ‌హ‌మ్మారి ప్రబలడంతో లాక్‌డౌన్లు విధించారు. దీంతో జీడీపీ వృద్ధి రేటు 7.5 శాతానికి త‌గ్గింది.

వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ జోరుగా సాగడం, నిత్యావ‌స‌రాల ధరల్లో స్థిరత్వం, వ‌స్తువినిమ‌య గిరాకీ పెరగడం, ఇండస్ట్రీలు, సర్వీస్ రంగాల్లో పెరుగుదలతో వృద్ధి రేటు దూసుకుపోయింది.

మ‌రోవైపు దేశంలో రిక‌వ‌రీ రేటు ప్రోత్సాహ‌క‌రంగా ఉన్నా.. ధ‌ర‌ల మంట‌, అధిక వ‌డ్డీరేట్లు, జాబ్ మార్కెట్ రిక‌వ‌రీ మంద‌కొడిగా ఉండ‌టం ప్రధాన అవ‌రోధాలుగా ఎకనామిక్ నిపుణులు చెబుతున్నారు.