నన్ను గెలిపిస్తే మీకు అందుబాటులో ఉండి పని చేస్తా: గెల్లు శ్రీనివాస్

gellu Srinivas election campaign in Veenavanka Mandal Mamidalapalli , veenavanka mandal

gellu Srinivas election campaign in Veenavanka Mandal Mamidalapalli , veenavanka mandal

తన స్వార్థం కోసమే ఈటల రాజేందర్ మళ్లీ ఎన్నికలు తీసుకొచ్చాడని, హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలపై ఈటలకు ప్రేమ లేదని అన్నారు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని వీణవంక మండలం మామిడాలపల్లిలో మంత్రి హరీష్ రావుతో కలసి గెల్లు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుజూరాబాద్ నియోజకవర్గంపై ఈటెలకు చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్ దగ్గర మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకునేవాడు కాదని అన్నారు. సీఎం కేసీఆర్ అవకాశం ఇస్తేనే ఈటల ఈ స్థాయికి వచ్చారని అన్నారు. తన ఆత్మగౌరం దెబ్బతిన్నదని రాజీనామా చేశానంటున్న ఈటల.. ఏ విధంగా దెబ్బతిన్నదో చెప్పాలన్నారు.

6 సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే హుజరాబాద్ నియోజకవర్గానికి ఏమీ చేయలేదని మండిపడుతూ.. కల్యాణలక్ష్మి, రైతుబంధుతో మన కడుపు నిండదు అంటున్న ఈటలను ఓడించాలన్నారు. పేదింటి బిడ్డను.. ఉద్యమకారుడినైన తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని గెల్లు కోరారు. తనను గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి పని చేస్తానని చెప్పారు. మొసలి కన్నీరు కారుస్తున్న ఈటలకు తగిన విధంగా రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు.