బండి సంజయ్ ఏం చేశిండు.. ఈటల రాజేందర్ ఏం చేశిండు.. వాళ్లతోటి ఏం కాదు

Gellu Srinivas Speech At Kamalapur Meeting
Gellu Srinivas Speech At Kamalapur Meeting

ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఇప్పటి వరకు ఏం చేశాడో ఒక్కసారి ప్రజలకు చెప్పాలి.. ఓట్ల కోసమే ప్రజల దగ్గరికి వచ్చి.. గెలిచిన తర్వాత మొఖం కూడా చూపించని నాయకులను నమ్మొద్దు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్ ఏ గ్రామంలో కూడా కనీసం ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదని హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ అన్నారు.

Gellu Srinivas Speech At Kamalapur Meeting
Gellu Srinivas Speech At Kamalapur Meeting

హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం భీంపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడే ఏం చేయలేని ఈటల రాజేందర్.. ఇప్పుడేం చేస్తారు? తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాకుండా.. ఇతర పార్టీ ఎమ్మెల్యేలు వారు గెలిచిన నియోజకవర్గాలకు ఏమైనా చేశారా? వారు చేసిన అభివృద్ధిని చూపిస్తారా? అని గెల్లు ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధి కేవలం సీఎం కేసీఆర్ గారికి, టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందని గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నన్ను గెలిపిస్తే.. హుజురాబాద్ కు మెడికల్ కాలేజీ తీసుకొస్తా. నా మీద నమ్మకం ఉంచి నాకు అవకాశం ఇస్తారని నమ్ముతున్నా అని గెల్లు అన్నారు.