మోహన్ బాబుకు జీహెచ్ఎంసీ ఫైన్.. ఎందుకంటే..

టాలీవుడ్ డైలాగ్ కింగ్ మోహన్‌బాబుకు జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ షాకిచ్చింది. ఇంటి బయట ఎల్‌ఈడీ లైట్లతో కూడిన భారీ హోర్డింగ్‌ను ఏర్పాటు చేసినందుకు గాను ఏకంగా లక్ష రూపాయలు ఫైన్ వేసింది.
ఎలాంటి ముందస్తు లిఖిత పూర్వక అనుమతి లేకుండా పెద్దపెద్ద హోర్డింగ్స్ ను ఏర్పాటు చేసినందుకు గాను ఈ జరిమానా విధిస్తున్నట్టు జీహెచ్ఎంసీ పేర్కొంది. ఇంటి ముందు ఏర్పాటు చేసిన అడ్వైర్‌టైజ్‌మెంట్ బోర్డు భవనం ఫ్రంటేజ్‌కు 15 శాతం మించిపోయిందని తెలిపింది. అనుమతి లేకుండా ఇలాంటివి ఏర్పాటు చేయడం సంబంధిత సెక్షన్ల ప్రకారం నేరమని, కాబట్టి జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం లక్షల రూపాయల జరిమానా వేస్తున్నట్టు పేర్కొంది.