పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. అదే దారిలో వెండి కూడా..

gold and silver price today in telugu states

gold and silver price today in telugu states

భారతీయులకు బంగారం అంటే ఎంతో ప్రీతి, మక్కువ. ఏ మతంతోనూ సంబంధం లేకుండా ప్రతీ ఇంట్లోనూ బంగారం మాత్రం తప్పకుండా ఉండి తీరాల్సిందే. భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యధికంగా విలువ ఇస్తుంటారు మహిళలు. అయితే దేశీయంగా బంగారం ధరలు మరోసారి పెరిగాయి. బంగారం ధర పెరగడం ఇది వరుసగా మూడో రోజు కావడం గమనార్హం. పసిడి ప్రేమికులకు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. బంగారం ధర పెరిగితే వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది.

తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,090 ఉంది. ఏపీలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,010 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,010 ఉంది.

బంగారం ధర పైకి చేరితే.. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. వెండి రేటు రూ.900 పరుగులు పెట్టింది. దీంతో కేజీ వెండి ధర రూ.68,200కు ఎగసింది. వెండి పట్టీలు, కడియాలు కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. ఔన్స్‌కు 0.28 శాతం పైకి కదిలింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1783 డాలర్లకు చేరింది. వెండి రేటు మాత్రం పడిపోయింది. ఔన్స్‌కు 0.27 శాతం తగ్గుదలతో 23.71 డాలర్లకు క్షీణించింది.