పండగ వేళ పెరిగిన బంగారం, వెండి ధరలు..!

రెండు, మూడు రోజుల నుంచి తగ్గిన బంగారం ధరలు.. దసరా పండుగ వేళ కాస్తా పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,160 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.44,150 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.48,160 ఉంది. అలాగే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.65,800 ఉండగా, విజయవాడలో రూ. 65,800 వద్ద కొనసాగుతోంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.46, 300 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,510 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.46,290 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.47,290 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.44,440 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.48,480 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.44,150 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.48,160 ఉంది.