పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. పడిపోయిన బంగారం, వెండి ధరలు

gold and silver rate today, 12 september 2021 in hyderabad

gold and silver rate today, 12 september 2021 in hyderabad

పసిడి ప్రేమికులకు ఊరట. బంగారం ధర దిగొచ్చింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇక వెండి కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర భారీగానే తగ్గింది.

మార్కెట్ డిమాండ్, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిస్థితుల ఆధారంగా బంగారం ధరలో హెచ్చుతగ్గులు ఉంటాయి. బంగారం ధరల్లో ఒక రోజు పెరిగితే.. మరో రోజు తగ్గుముఖం పడుతుంది. తాజాగా ఆదివారం మాత్రం దేశీయంగా పరిశీలిస్తే పసిడి ధరలు నిలకడగా ఉండగా, వివిధ ప్రధాన నగరాల్లో మాత్రం హెచ్చుతగ్గులు ఉన్నాయి. మొత్తం మీద ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా దిగి వచ్చింది. తాజాగా దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో ఉదయం 6 గంటల సమయానికి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.440 కు తగ్గింది. దీంతో బంగారం ధర రూ.48,110గా ఉంది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.400 తగ్గుదలతో రూ.44,100కు దిగొచ్చింది. వెండి ధర కూడా పడిపోయింది. రూ.1100 దిగొచ్చింది. దీంతో కేజీ వెండి ధర రూ.68,500కు తగ్గింది. వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది మంచి చాన్స్.