స్వల్పంగా తగ్గిన బంగారం ధర. భారీగా పెరిగిన వెండి.

మూడు రోజుల పాటు నిలకడగా ఉన్న బంగారం ధరలు మళ్లీ తగ్గుతున్నాయి. నిన్న, ఇవాళ బంగారం ధరలు కాస్త తగ్గాయి. బంగారం కొనుగోలు చేయాలని చాలా రోజుల నుంచి భావిస్తున్న వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. 24 క్యారెట్స్ గోల్డ్ పై రెండు రోజుల్లో దాదాపు 600 రూపాయలకు పైగా ధర తగ్గింది. వెండి ధరల్లో మాత్రం భారీగా తేడా వచ్చింది. వెండి కిలో వెయ్యి రూపాయలు పెరిగింది.

హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు

హైదరాబాద్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.22 దిగొచ్చింది. దీంతో 24క్యారెట్ల బంగారం ధర రూ.48, 000కు తగ్గింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.20 తగ్గుదలతో రూ.44,000 కు చేరింది.

వెండి ధరలు

బంగారం ధరలు మాత్రం భారీగా పెరిగాయి.  రూ. 1000 పెరగటంతో కేజీ వెండి ధర రూ. 74,900కు చేరింది. గత వారం రోజులుగా ధరలు చూస్తే మాత్రం కిలో వెండికి రూ. 180 వరకు పెరిగింది.