మహిళలకు గుడ్‌న్యూస్‌.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు

Gold Prices Today: Gold, Silver Rates Decline On Global Cues

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి అదిరే శుభవార్త. రెండు రోజుల నుంచి బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. తాజాగా గురువారం కూడా ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశీయంగా ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,630 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,630 గా కొనసాగుతోంది.

హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర పడిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.390 దిగొచ్చింది. దీంతో బంగారం ధర రూ.48,760కు తగ్గింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.350 తగ్గుదలతో రూ.44,700కు క్షీణించింది.
బంగారం ధర దిగివస్తే.. వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర ఏకంగా రూ.1900 దిగొచ్చింది. దీంతో కేజీ వెండి ధర రూ.67,600కు క్షీణించింది. వెండి పట్టీలు, కడియాలు కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది తీపికబురు అని చెప్పొచ్చు.