స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

నేటి బంగారం ధరలు
నేటి బంగారం ధరలు

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల్లో నిత్యం మార్పులు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. పసిడి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుముఖం పడుతుంటాయి. అందుకే బంగారం, వెండి కొనుగోలు చేసే వినియోగదారులు వాటి ధరలవైపు నిత్యం దృష్టిపెడుతుంటారు.

అయితే తాజాగా బుధవారం దేశ రాజ‌ధాని ఢిల్లీలో బంగారం ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గాయి. ఢిల్లీ మార్కెట్‌లో ఇవాళ 10 గ్రాముల స్వ‌చ్ఛ‌మైన బంగారం ధ‌ర రూ.152 త‌గ్గి రూ.46,328కి చేరింది. క్రితం ట్రేడ్‌లో తులం స్వ‌చ్ఛ‌మైన బంగారం ధ‌ర రూ.46,480 వ‌ద్ద ముగిసింది. ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి మార‌కం విలువ స్వ‌ల్పంగా బ‌ల‌ప‌డ‌ట‌మే ఇవాళ బంగారం ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గ‌డానికి కార‌ణ‌మ‌ని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.

ఇక వెండి ధ‌ర‌లు కూడా ఇవాళ స్వ‌ల్పంగా త‌గ్గాయి. ఢిల్లీ మార్కెట్లో ఇవాళ కిలో వెండి ధ‌ర రూ.286 త‌గ్గి రూ.62,131కి చేరింది. క్రితం ట్రేడ్‌లో కిలో వెండి ధ‌ర రూ.62,417 వ‌ద్ద ముగిసింది. ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి మార‌కం విలువ 6 పైస‌లు బ‌ల‌ప‌డి రూ.74.29కి చేరింది. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ఇవాళ ఔన్స్ బంగారం ధ‌ర 1,787 అమెరిక‌న్ డాల‌ర్లు, ఔన్స్ వెండి ధ‌ర 23.74 అమెరిక‌న్ డాల‌ర్లు ప‌లికింది.