పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర

ప్రస్తుత పెళ్లీల సీజన్ లో బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. మార్కెట్లో బంగారం ధర భారీగా తగ్గింది. 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారంపై ఏకంగా రూ.1,290 తగ్గింది. రానున్న రోజుల్లో మళ్లీ బంగారం రేట్లు పెరిగే అవకాశం ఉందని.. ఇప్పుడే బంగారం కొనుక్కోవాలని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. కాగా ఆయా నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

Gold, silver price today, November 6: Silver outshines gold on Saturday
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,500 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,990గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,210 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,280కి చేరింది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,340 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,460 అయింది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,150గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.45,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,150గా ఉంది.

హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,050 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.49,150గా ఉంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,050 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.49,150గా ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,050 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.49,150వద్ద కొనసాగుతోంది.