యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి బంగారు సింహాసనం

యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి, అమ్మవార్లకు బంగారు సింహాసనం సిద్ధమైంది. మండపంలో ఈ సింహాసనంపై ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించి నిత్యకల్యాణ క్రతువును వైభవంగా నిర్వహించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.

సుమారు రూ.18లక్షల వ్యయంతో బంగారు పూతతో తయారు చేసిన స్వర్ణ సింహాసనానికి ఆదివారం ఆలమ ఈవో పూజలు నిర్వహించారు. న్యూయార్క్ కు చెందిన ప్రవాస భారతీయలు సామల, వీరమణి స్వామి దంపతులు స్వామి వారికి కానుకగా ఈ బంగారు సింహాసనం అందించినట్టు అధికారులు తెలిపారు.