ఆ మూడు యాప్స్ ప్రమాదం.. వెంటనే డిలీట్ చేయండి.. గూగుల్ ప్లేస్టోర్ ప్రకటన - TNews Telugu

ఆ మూడు యాప్స్ ప్రమాదం.. వెంటనే డిలీట్ చేయండి.. గూగుల్ ప్లేస్టోర్ ప్రకటన



యూజర్స్ కి మెరుగైన సేవలు అందించడంలో భాగంగా వైరస్, మాల్వేర్ సమస్యలున్న యాప్స్ ని గుర్తించి ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తుంటుంది గూగుల్ ప్లే స్టోర్. ఈ మధ్యే అలాంటి 150 యాప్స్ ని ప్లే స్టోర్ నుంచి తొలగించింది. యూజర్లు కూడా ఆ యాప్స్ ని ఫోన్ లో నుంచి డిలీట్ చేయమని సూచించింది. తాజాగా అలాంటి మూడు ప్రమాదకరమైన యాప్స్ పేర్లను ప్రకటిస్తూ.. ప్లే స్టోర్ నుంచి తొలగించినట్టు తెలిపింది.

Google Play Store Deleted Three Photo Editing Apps
Google Play Store Deleted Three Photo Editing Apps

ఫొటో ఎడిటింగ్ యాప్స్ ద్వారా నేరగాళ్లు ఫేస్ బుక్ మెకానిజమ్ ఉపయోగించి ఫేస్ బుక్ అకౌంట్లు హ్యాక్ చేసి వారి డేటా, బ్యాంక్ సమాచారం, వ్యక్తిగత సమాచారం సేకరిస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. అలాంటి యాప్స్, సైబర్ క్రైమ్స్ మీద రీసెర్చి చేసిన కాస్పర్ స్కై అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ తాజాగా చేసిన సర్వేల ప్రకారం మాల్వేర్, వైరస్ ప్రమాదమున్న ఫొటో ఎడిటింగ్ యాప్ లను ప్లేస్టోర్ తొలగించింది. యూజర్స్ ఈ యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకున్న వెంటనే లాగిన్ అవసరం లేకుండానే వారి ఫేస్‌బుక్‌, టిండర్‌, స్పోటిఫై వంటి సోషల్‌ మీడియా యాప్‌ల లాగిన్ వివరాలతో ఆటోమేటిగ్గా లాగిన్ అయ్యేలా సైబర్‌ నేరగాళ్లు మాల్‌వేర్ ప్రోగ్రాం చేసినట్లు కాస్పర్ స్కై వెల్లడించింది. ప్లేస్టోర్ వినియోగదారులు యూజర్స్ ఈ యాప్స్‌ని తమ డివైజ్‌ల నుంచి తొలగించి, తమ ఫేస్‌బుక్ ఖాతాల లాగిన్‌ వివరాలను రీసెట్ చేయాలని సూచించింది. అలానే యూజర్స్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసే యాప్స్‌ పేర్లలో అక్షర దోషాలు ఉంటే వాటికి దూరంగా ఉండటమే ఉత్తమమని సూచించింది.

గూగుల్ తొలగించిన యాప్స్‌ ఇవే..

మ్యాజిక్‌ ఫొటో ల్యాబ్ – ఫొటో ఎడిటర్‌(Magic Photo Lab: Photo Editor)

బ్లెండర్‌ ఫొటో ఎడిటర్‌ – ఈజీ ఫొటో బ్యాక్‌గ్రౌండ్ ఎడిటర్‌ (Blender Photo Editor – Easy Photo Background Editor)
పిక్స్ ఫొటో మోషన్‌ ఎడిట్ 2021 (Pix Photo Motion Edit 2021)