ఆ జట్టు కెప్టెన్ పీకిందేం లేదు.. కోహ్లీ కెప్టెన్సీ కూడా ఆస్వాదించలేదు

Goutham Gambhir Sensational Comments On Kolkata Night Riders Captain Eon Morgan
Goutham Gambhir Sensational Comments On Kolkata Night Riders Captain Eon Morgan
Goutham Gambhir Sensational Comments On Kolkata Night Riders Captain Eon Morgan
Goutham Gambhir Sensational Comments On Kolkata Night Riders Captain Eon Morgan

ఈ సారి ఐపీఎల్ సీజన్ దాదాపు తుదిదశకు వచ్చింది. నాలుగు జట్లు ప్లే ఆఫ్స్ కి వచ్చాయి. ఆ నాలుగు జట్ల కెప్టెన్ల పనితీరు గురించి భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మాట్లాడాడు. ఒక్కో టీమ్ కెప్టెన్ పనితీరు, జట్టును నడిపించిన విధానం.. ప్లే ఆఫ్ వరకు రావడంతో చేసిన కృషి గురించి రివ్యూ ఇచ్చాడు. అయితే.. ముగ్గురు కెప్టెన్లను మెచ్చుకున్న గంభీర్.. ఒక్క కెప్టెన్ పై మాత్రం దుమ్మెత్తి పోశాడు. ఆ జట్టు ప్లే ఆఫ్ వరకు రావడానికి ఆయనేం చేయలేదని.. అంతా వీడియో ఎనలిస్టే చేశాడని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ధోని ఆల్వేస్ బెస్ట్..
ప్లే ఆఫ్ కి చేరిన చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కలకత్తా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల కెప్టెన్ల పనితీరును గౌతమ్ గంభీర్ విశ్లేషించాడు. కెప్టెన్సీ పరంగా చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ సూపర్ అని.. కెప్టెన్సీ విషయంలో ధోని గురించి ఎంత చెప్పినా తక్కువే అంటూ ఆకాశానికెత్తాడు. అతడు ఒత్తిడిని సమర్థవంతంగా హ్యాండిల్ చేయగలడు. బ్యాటింగ్ లో విఫలమైనప్పటికీ ఆయన కెప్టెన్సీ మాత్రం అమోఘం.. అంటూ కితాబిచ్చాడు గౌతమ్ గంభీర్.

సీనియర్లు ఉండటం పంత్ కి కలిసొచ్చింది

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో సీనియర్లు ఉండటం కెప్టెన్ రిషభ్ పంత్ కు బాగా కలిసొచ్చిందన్నాడు గంభీర్. స్టీవ్ స్మిత్, ధావన్, అశ్విన్ వంటి సీనియర్ ఆటగాళ్లు పంత్ కి అండగా నిలుస్తున్నారని చెప్పాడు. అయితే కెప్టెన్ గా మాత్రం నెంబర్ వన్ స్థానంలో ధోని మాత్రమే ఉంటాడు అంటున్నాడు గంభీర్.

కోహ్లీ కెప్టెన్సీ ఆస్వాదించలేదు..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం కెప్టెన్‌గా అద్భుత ప్రదర్శన కనబర్చాడని మెచ్చుకున్నాడు గంభీర్. అయితే.. నిజాయితీగా చెప్పాలంటే ఇంతకు ముందెప్పుడూ కోహ్లీ కెప్టెన్సీని ఆస్వాదించలేదు. కానీ ఈసారి మాత్రం కొహ్లీ అద్భుత సారథ్యానికి ఫిదా అయ్యాను. బహుషా కెప్టెన్‌గా ఇదే చివరి సీజన్ కాబట్టి కోహ్లీ రిలాక్స్‌గా ఉన్నట్లున్నాడు. దీనికి తోడు.. ఈ సీజన్ లో కోహ్లీ టీమ్ కి మంచి బౌలర్లు ఉన్నారు. అది ఆ జట్టుకు కలిసొచ్చిందని గంభీర్ వివరించాడు.

అతడు వేస్ట్ కెప్టెన్..
మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ ల కెప్టెన్సీని మెచ్చుకున్న గౌతీ.. కలకత్తా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ను మాత్రం టార్గెట్ చేశాడు. కలకతా నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా ఇయాన్ మోర్గాన్ చేసిందేం లేదని, ఆ జట్టు వీడియో అనలిస్టే జట్టును ముందుకు నడిపించాడన్నాడు. ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరడానికి అతడే కారణమని గౌతీ అన్నాడు. మోర్గాన్ కేవలం ఆ జట్టు వీడియో ఎనలిస్టును ఫాలో అయ్యాడు. మైదానంలో అతను సారథ్యం వహించినట్లు నాకు ఎక్కడా కనిపించలేదు. బహుశా మైదానం బయట కెప్టెన్‌గా ఉన్నాడేమో.. అంటూ ఘాటుగానే కామెంట్లు చేశాడు.