తమిళనాడులో పొంగల్ వేడుకలు. పాల్గొన్న మన గవర్నర్ తమిళసై

మన రాష్ట్ర గవర్నర్ తమిళసై పొంగల్ సెలబ్రేట్ చేసుకున్నారు. తమిళనాడులోని తన నివాసం ఘనంగా పొంగల్ నిర్వహించారు. సంప్రదాయంగా పద్దతి, తమిళ ఆచారాలకు అనుగుణంగా వేడుకలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను గవర్నర్ తమిళసై ట్విట్టర్ లో షేర్ చేశారు. కరోనా ప్రమాదం ఇంకా పొంచి ఉన్నందున…పండుగను జాగ్రత్తగా జరుపుకోవాలని కోరారు. కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని ప్రజలకు సూచించారు.