సీజేఐ ఎన్వీ రమణకు స్వాగతం పలికిన గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌

సుప్రీంకోర్టు, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, రాజ్‌భవన్‌, గవర్నర్‌ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌, పోలీసుల గౌరవ వందనం,

భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణకు రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్‌ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వాగతం పలికారు. అనంతరం ఎన్వీ రమణ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌గా ఎన్వీ రమణ పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి హైదరాబాద్‌కు వచ్చారు. మూడు రోజులపాటు రాజ్‌భవన్‌ అతిథిగృహంలో బస చేయనున్నారు.

అంతకుముందు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఎన్వీ రమణకు తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ హిమా కోహ్లీ, మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్‌, ఎమ్మెల్యేలు, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు.

నిన్న తిరుమల చేరుకున్న చీఫ్ జస్టిస్.. నిన్న రాత్రి, ఇవాళ ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్‌ దర్శనంలో సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.