సూరత్‌లో భారీ అగ్నిప్రమాదం.. చిక్కుకున్న 200 మంది కార్మికులు

Guj: 2 killed in fire in Surat packaging unit; over 125 rescued

Guj: 2 killed in fire in Surat packaging unit; over 125 rescued

గుజరాత్‌లోని సూరత్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పల్సానా తాలుకా వరేలీ గ్రామంలో ఉన్న ఓ ప్యాకేజీ ఫ్యాక్టరీలో అనూహ్యంగా మంటలు చెలరేగాయి. ఘటనలో ఇద్దరు మృతిచెందగా, 15మంది గాయపడ్డారు. మరో 200 మంది కార్మికులు పరిశ్రమలో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 125 మందిని సురక్షితంగా కాపాడారు.

పరిశ్రమలోని నాలుగో అంతస్థు నుంచి క్రేన్ల సహాయంతో కార్మికులను బయటకు తీశారు. ఈ సమయంలో పైపు పట్టుకుని, అదుపు తప్పి ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. సూరత్​ మేయర్ హిమాలి బఘోవాలా​ ఘటనాస్థలానికి వెళ్లి సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్టు తెలుస్తోంది. కాగా ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.