తిక్కరేగి పీఎస్ ను తగులబెట్టాడు.. విషయం తెలుసుకొని ఓదార్చిన పోలీసులు

Gujarat: Fed up with wife’s behaviour, young man sets police chowki on fire to get jailed

Gujarat: Fed up with wife’s behaviour, young man sets police chowki on fire to get jailed
భార్యా బాధితులు ఇలా కూడా ఉంటారా అని ఈ న్యూస్ చదివాక అనిపించక మానదు. భార్య వేధింపులు తట్టుకోలేక ఓ వివాహితుడు ఏకంగా పోలీస్​ స్టేషన్​కే నిప్పు అంటించాడు. ‘నన్ను అరెస్ట్​ చేసి జీవితాంతం జైలులో పెట్టండి’ అంటూ స్టేషన్​ ఎదుటే నిల్చున్నాడు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినందుకు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జరిగింది.

దినసరి కూలీగా పనిచేసే దేవ్ జీ అనే వ్యక్తి .. పెళ్లి అయిన కొద్దిరోజుల నుంచే తన భార్య వేధింపులకు గురి చేయడం ప్రారంభించిందట. ఆమె నుంచి విముక్తి పొందడానికి బజరంగ్​వాడిలోని స్టేషన్​కు నిప్పంటించాడు. పోలీస్‌ స్టేషన్‌కు నిప్పంటించిన దేవ్ జీ ఎక్కడకి పారిపోలేదు. ‘నన్ను అరెస్ట్‌ చేయండి’ అంటూ.. పీఎస్ ముందే నిల్చుండిపోయాడు. అందుకు తగ్గట్టుగానే.. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినందుకు గాను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో అసలు విషయం చెప్పుకొచ్చాడా వ్యక్తి. పెళ్లి అయిన కొద్దిరోజుల నుంచే తన భార్య వేధింపులకు గురి చేయడం ప్రారంభించిందని బాధపడ్డాడు. అయితే.. పోలీస్‌ స్టేషన్‌కు నిప్పు అంటించిన ఆ వ్యక్తి మానసిక స్థితి బాగోలేదని విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు.