మునుగోడులో కాల్పుల కలకలం

నల్గొండ: నల్లగొండ జిల్లా మునుగోడు (మం)ఊకొండి శివారులో కాల్పులు కలకలం సృష్టించాయి. బైకుపై వెళ్తున్న యువకుడిపై దుండగులు మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బాధితుడికి తీవ్రగాయాలు కాగా.. నార్కట్ పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు.

భాదితుడు నార్కట్ పల్లి (మం) బ్రాహ్మణ వెళ్ళెంల గ్రామానికి చెందిన లింగస్వామిగా గుర్తించారు. కాల్పులకు పాల్పడ్డ దుండగుల కోసం వేట సాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.