కోవిడ్ వచ్చి తగ్గాక జుట్టు రాలుతోందా..? నిపుణులేమంటున్నారంటే.. !

Hair Falling Due to Corona Side Effects
Hair Falling Due to Corona Side Effects

ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ నడుస్తున్న సమయంలో దాదాపు చాలామందికి కరోనా వచ్చి ఇప్పటికే తగ్గిపోయి ఉంటుంది. వచ్చిన వారికే మళ్లీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే.. ఒకసారి కరోనా వచ్చి తగ్గిన తర్వాత చాలామందిలో కరోనా సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నప్పటికీ మునుపటిలా ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండలేకపోతున్నారట. అయితే.. కరోనా వచ్చి తగ్గిన చాలామందిలో కనిపిస్తున్న ప్రధాన సమస్య జుట్టు రాలడం. కరోనా తగ్గిన తర్వాత జుట్టు రాలడానికి నిపుణులు పలు కారణాలు చెప్తున్నారు.

Hair Falling Due to Corona Side Effects
Hair Falling Due to Corona Side Effects

కరోనా వల్ల తీవ్ర ఒత్తిడికి గురై.. తిరిగి మామూలు స్థితికి చేరుకోవడం వలన బాడీలో చాలా మార్పులు జరుగుతాయట. ఆ సైడ్ ఎఫెక్ట్స్ లో జుట్టు రాలడం కూడా ఒకటి. ఒత్తిడికి గురి కావడం వల్ల మెదడు మీద ఎక్కువ భారం పడి.. తలపై ఉండే వెంట్రుకల మీద ప్రభావం చూపిస్తుందట. తలలో ఇన్ఫెక్షన్ ఏర్పడి.. మంటగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయట. శరీరం లో విటమిన్ బి 12, విటమిన్ డి స్థాయులు కూడా తగ్గిపోతాయట. దీంతో జుట్టు రాలడం, పెలుసుబారడం, జీవం లేనట్టుగా మారడం, బలహీన పడటం వంటివి కనిపిస్తాయట. వీలైనంత ఎక్కువగా పోషకాహారాలు తీసుకుంటూ.. నూనెతో జుట్టు నిత్యం మృదువుగా మర్దన చేస్తే జుట్టు రాలకుండా కాపాడుకోవచ్చంటున్నారు నిపుణులు. తలస్నానం చేసేటప్పుడు నీళ్లు ఎక్కువ వేడిగా, ఎక్కువగా చల్లగా ఉండకుండా చూసుకోవాలి. తల తుడిచేటప్పుడు కూడా మెల్లిగా తుడవాలి. హెయిర్ డ్రయ్యర్లు వాడకపోవడమే బెటర్.