కోవిడ్ బాధితులను పరామర్శించిన హరీష్ రావు

మెదక్ జిల్లా కేంద్రం  ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ బాధితులను రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. వైద్య సేవలు ఎలా అందుతున్నాయంటూ.. వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.

జిల్లా ఆసుపత్రిలో 219 రేమిడిసివిల్ ఇంజెక్షన్ అందుబాటులో ఉన్నాయన్నారు. మెదక్ జిల్లా లో ఆక్సిజన్ బెడ్స్ మెదక్, నర్సాపూర్, తూప్రాన్, లో అందుబాటులో ఉన్నట్లు మంత్రి చెప్పారు.

పేద ప్రజలు ప్రవేట్ ఆసుపత్రిలో చేరి డబ్బులు వృథా చేసుకోవద్దన్నారు.  ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పారు.  వైద్య సిబ్బంది వారి ప్రాణాలను ఫణంగా పెట్టి ఉద్యోగాలు చేస్తున్నారని వారిని అభినందించారు.

నిత్యావసర సరుకుల కోసం వచ్చే వారు ఇంటికి ఒక్కరు వచ్చి తీసుకుని వెళ్ళాలని సూచించారు.  కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ కొరత గురించి  మాట్లాడం జరిగిందని, త్వరలోనే  వ్యాక్సిన్ అన్ని వయసుల వారికి ఇవ్వడం జరుగుతుందని భరోసా నిచ్చారు.

ధాన్యం కొనుగోలు లో ఎలాంటి ఇబ్బందులు ఉన్న జిల్లా అధికార దృష్టికి తీసుకెళ్ళాలని సూచించారు. ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేయడం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు.