సిలిండర్ కు దండం పెట్టు.. బీజేపీని బొంద పెట్టు… కారుకు ఓటు కొట్టు

Harish Rao Fires On Bjp In Huzurabad Election campaign
Harish Rao Fires On Bjp In Huzurabad Election campaign
Harish Rao Fires On Bjp In Huzurabad Election campaign
Harish Rao Fires On Bjp In Huzurabad Election campaign

పెట్రోల్ డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదల భారం వల్ల ఉప్పు, పప్పు, కూరగాయలు, మంచి నూనేల ధర పెరిగింది. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి కేంద్రం కారణం కాదా. ప్రజల మీద ప్రేమ ఉంటే ధరలు తగ్గించండి. లేందటే పెంచినమని బాజాప్తా చెప్పండి.. అబద్దాలు ఎందుకు చెబుతున్నరు అని మంత్రి హరీష్ రావు హుజురాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ప్రశ్నించారు. నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఛాలెంజ్ చేస్తున్న.. కేంద్ర బడ్జెట్ పుస్తకాలు తీసుకుని వస్తా. కేంద్రమంత్రిగా మీరు రండి.. రాష్ట్ర ఆర్థికమంత్రిగా నేను వస్తా. ఎక్కడికి రమ్మంటే అక్కడకు వస్తా. ఇంత పచ్చి అబద్దాలు ఆడి మీ స్థాయిని తగ్గించుకోవద్దు. కేంద్ర మంత్రి స్థాయిలో మాట్లాడినప్పుడు వాస్తవాలు మాట్లాడాలి. బాధ్యతాయుతంగా మాట్లాడాలి అంటూ హరీష్ రావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి చురకలంటించారు.

కేసీఆర్ కిట్ లో కేంద్ర ప్రభుత్వం రూ.5 వేలు ఇస్తుందని అన్నారు. ఇదెక్కడి అన్యాయం. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఈటలనే చెప్పిండు.. కేసీఆర్ కిట్ లో కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వడం లేదని, మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుందని చెప్పిండు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని అబద్దం చెప్తుండు. దళిత బందు ఆపలేదని చెప్తున్నరు. ప్రేమేందర్ రెడ్డి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 7-10-2021 నాడు బీజేపీ తరపున కేంద్ర ఎన్నికల కమిషన్ కు రాసింది నిజం కాదా అని ప్రశ్నించారు. సిలిండర్ ధర అని రోజు తిరుగుతున్నరు. సిలిండర్ నీ గుర్తా అని ఈటల మాట్లాడుతున్నడు.. మరి మీరు రోజు కారులో తిరుగుతున్నరు. మా కారు గుర్తుకే ప్రచారం చేస్తున్నారా అంటూ పంచ్ వేశారు మంత్రి హరీష్. అందుకే.. ప్రజలంతా ఒక విషయం గుర్తు పెట్టుకోవాలె.. సిలిండర్ కు దండం పెట్టు.. బీజేపీని బొంద పెట్టు.. కారు గుర్తుకు ఓటు కొట్టు అని మంత్రి హరీష్ పిలుపునిచ్చారు.