అబద్ధాల పునాదుల మీద ఓట్లు పొందాలని చూస్తున్న బీజేపీ నేతలకు బుద్ధి చెప్పండి

Harish rao Fires on bjp
Harish rao Fires on bjp

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ నేతలు అబద్ధాల పునాదుల మీద ప్రజలను మభ్య పెట్టి ఓట్లు పొందాలని చూస్తున్నారు. వారికి తగిన బుద్ధి ప్రజలే చెప్తారు అన్నారు మంత్రి హరీష్ రావు. నడిరోడ్డు మీద, పట్టపగలు నగ్నంగా అబద్దాలు ఆడుతూ ఆత్మవంచన చేసుకుంటూ, ప్రజలను వంచించి నాలుగు ఓట్లు పొందాలనుకోవడం దివాళా కోరు రాజకీయం. బీజేపీ నేతలను చూస్తుంటే సిగ్గేస్తుంది అననారు. ప్రజాస్వామ్యంలో తాము ఏం చేశాం, ఏం చేస్తున్నామో చెప్పాలి కానీ.. బీజేపీ నేతలు అబద్దాలు ఆడుతూ.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. ఏడు సంవత్సరాలుగా ప్రజలను టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తుందని, కేసీఆర్ గారు మోసం చేస్తుందని ప్రచారం చేయడం బీజేపీ ఆత్మవంచనకు నిదర్శనం. ప్రజలకు కేసీఆర్, టీఆర్ఎస్ ఏం ఇచ్చిందో ఏ ఇంటి పసిబిడ్డను అడిగినా చెప్తారనన్నారు మంత్రి హరీశ్.
ఏడేళ్ల క్రితం బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే నల్లధనం వెనక్కు తెచ్చి.. 15 లక్షలు మీ అక్కౌంట్లలో వేస్తాం అన్నారు. ఏ అక్కౌంట్లో వేశారో చెప్పండి అంటూ ఆయన ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే డీజీల్, పెట్రోల్ ధరలు తగ్గిస్తామన్నారు. తగ్గినయా, పెరిగినయా… రెండింతలు పెంచిన ఘనత మీది అంటూ మంత్రి మండిపడ్డారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. కనీసం రెండులక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నారా? రాష్ట్రానికో ప్రాజెక్టు కడతామన్నారు… ఎక్కడైనా కట్టారా? అని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, బీజేపీ నేతలపై మంత్రి హరీష్ ప్రశ్నల వర్షం కురిపించారు.

Harish rao Fires on bjp
Harish rao Fires on bjp Leaders In Huzurabad Election Campaign

రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం. మద్ధతుధర ఇస్తామన్నారు. ఎంతిచ్చారు? విభజన చట్టంలో గిరిజన యూనివర్సిటీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలి.. తెలంగాణలో పెట్టారా? దీని గురించి ఎందుకుమాట్లాడరు? అని ప్రశ్నలు సంధించారు మంత్రి. రూ..200 ఉన్న పెన్షన్.. రూ.2000ఇస్తామన్నాం.. బరాబర్ ఇస్తున్నాం అన్నారు హరీష్. కేంద్ర మంత్రి అమిత్ షా గారే అన్నారు.. ఎన్నికల్లో ప్రజలను నమ్మించడానికి ఏవేవో చెప్పాల్సి వస్తుంది. ఎలక్షన్ కా జుమ్లా హై అన్నారు. యూట్యూబ్ లో చూస్తే కనిపిస్తుంది. మేం చెప్తాం ఎన్నికల కోసం తప్ప మేం చేయమని ఆయనే ఇండైరెక్ట్ గా చెప్పేశాడని మంత్రి ఎద్దేవా చేశారు.

ఎన్నికల్లో గెలవడానికి ఎన్నో బూటకపు వాగ్థానాలు చేశామని కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ అని చెప్పారు.. ఇవన్నీ యూట్యూబ్ లో ఉన్నాయి అంటూ మంత్రి బీజేపీపై మాటల దాడి చేశారు. ఎన్నికల్లో చెప్పినవి ఏవీ చేయని పార్టీ బీజేపీ పార్టీ. అందుకే బీజేపీని చిత్తు చిత్తుగా ఓడిస్తున్నరు. బెంగాల్లో వేల కోట్లు ఖర్చు పెట్టి , పారా మిలటరీ దళాలు దింపి, అధికార దుర్వినియోగం చేసి, కేసులు పెట్టి, ఇబ్బందులు పెట్టినా బెంగాల్ ప్రజలు బీజేపీని తిప్పికొట్టి మమతా బెనర్జీని గెలిపించారు. కేరళ, తమిళనాడులో ఏమైంది. నాగార్జున సాగర్, లో ఏమైంది. వరంగల్ కార్పోరేషన్ లో మైంది మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏమైంది.. ఇప్పుడు హుజూరాబాద్ లో కూడా అదే రిపీట్ అవుతుంది అన్నారు మంత్రి హరీష్. పెరుగుతున్న ధరలకు నిరసనగా ప్రజలు ఏ ఎన్నిక వచ్చినా బీజేపీని చిత్తుచిత్తుగా ఓడిస్తున్నారని మంత్రి తెలిపారు.


వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల ఏం చెప్పారు? కేంద్రం రైతులను మోసం చేస్తుంది బీజేపీ, రైతు వ్యతిరేక చట్టాలు తెస్తోంది బీజేపీ అన్నారు. నేను చట్టాలకు వ్యతిరేకంగా పోరాడతా అన్నరు. ఆ వీడియోలు యూట్యూబ్ లో కొడితే వస్తాయి. ఈరోజు బీజేపీ కండువా కప్పుకొని ఉం అంటున్నరు. బీజేపీ బాగా చేస్తుందని.. గొప్ప పార్టీ అని గప్పాలు కొడుతున్నరు. ఇక్కడ అబద్ధాలు చెప్తున్నది ఎవరు? మాట మార్చింది ఎవరు? ఈటల రాజేందర్ కాదా అని మంత్రి ప్రశ్నించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా రాజేందర్ కరోనా సమయంలో ఎం అన్నరు. మందులు ఇస్తలేరు. వెంటలేటర్లు ఇస్తలేరు. పీపీఈ కిట్లు ఇస్తలేరు. కరోనా విషయంలో కేంద్రం చేతులెత్తేసింది. తెలంగాణను చిన్నచూపు చూస్తోంది అన్నరు. ఇప్పుడేమోజజ బీజేపీ అంత గొప్ప పార్టీ లేదంటున్నరు. మాట మార్చింది ఎవరు? ధర్మం తప్పింది ఎవరు? నీతి తప్పింది ఎవరు రాజేందర్ గారు అని ప్రశ్నించారు మంత్రి హరీష్.