అబద్దాన్ని కూడా అందంగా చెప్పేవారే.. బీజేపీ నాయకులు

Harish Rao Fires On BJP

నిజం కాని విషయాలను కూడా అందంగా మార్చి అబద్ధాలను ప్రచారం చేసే తెలివి బీజేపీ నేతలకు మెండుగా ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు. కేంద్ర క్యాబినేట్ హోదా ఉన్న మంత్రులు కూడా పచ్చి అబద్ధాలు ఆడటం దారుణమని మంత్రి అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి క్రూడాయిల్ ధరలు పెరగడమే కారణమని చెప్పడం సిగ్గుచేట్టన్నారు. కేంద్ర ప్రభుత్వం బేసిక్ ఎక్సైజ్ డ్యూటీతో పాటు, రోడ్ సెస్, సర్ ఛార్జిలు వేస్తోంది. 3 రకాల చార్జీలు పెట్రోల్ , డీజిల్ మీద వసూలు చేసినంక ధరల పెరుగుదలకు కారణం బీజేపీ ఎందుకు కాదో చెప్పాలంటూ ఆయన ప్రశ్నించారు.

Harish Rao Fires On Etala Rajender And BJP Leaders
Harish Rao Fires On Etala Rajender And BJP Leaders

2014 లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లీటరు పెట్రోల్ పన్ను పది రూపాయల నలభై మూడు పైసలు ఉండేది. ఇప్పుడు అది రూ32.90కి పెరిగింది. ఈ ఏడేళ్లలో పెట్రోల్ మీద రూ.22.47 పన్ను పెంచింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాదా? బీజేపీ అధికారంలోకి వచ్చిన నాడు.. లీటర్ పెట్రోల్ మీద రూ.1043 పైసలు ట్యాక్స్ ఉండేది.. ఇప్పుడు 32.90 పైసలు వసూలు చేస్తున్నది బీజేపీ కాదా? 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిననాడు లీటర్ డిజీల్ మీద ఉన్న పన్ను.. రూ.4.52 ఈరోజు మూడు రకాల పన్నులు కలిపి.. రూ31.80 వసూలు చేస్తున్నది బీజేపీ కాదా? అని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.

Minister Harish Rao Election Campaign in Huzurabad-Rangapur
ప్రజలను ఈ స్థాయిలో దోచుకుంటూ.. ధరలు పెంచి వారి నడ్డి విరుస్తూ.. పైగా అబద్ధాలను అందంగా చెప్తున్న బీజేపీ నేతల తీరు చూస్తుంటే సిగ్గుగా ఉందంటూ ధ్వజమెత్తారు మంత్రి హరీష్. 2014-15 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి రూ.99వేల 68 కోట్ల ఆదాయం రాగా.. బీజేపీ అధికారంలోకి వచ్చిన ఏడెళ్లలో అంటే.. 2020-2021 సంవత్సరంలో రూ. 3లక్షల 72వేల 970 కోట్లు. అంతే ప్రజల మీద ఎంత భారం వేశారో అర్థం చేసుకోవాలని తెలిపారు మంత్రి. ఒక్క సంవత్సరానికే 2 లక్షల 73వేల 902 కోట్ల అదనపు భారం ప్రజల మీద మోపిందంటే.. ఏడేళ్లలో ఎంత భారం వేసిందో ప్రజలు ఆలోచించాలని ఆయన సూచించారు.