రాజేందర్.. బలగాలను దించితే ఓట్లు పడవు.. ప్రజల మనసులు గెలవాలి

Harish Rao Punches To Etala Rajender
Harish Rao Punches To Etala Rajender

ఢిల్లీలో అధికారముందని.. బలముందని పోలీసు బలగాలను దించుతా ఓట్లు పడవు.. ప్రజల మనసులు గెలిస్తేనే ఓట్లు పడుతాయ్. ప్రజల కోసం ఏం చేస్తావో చెప్పడం లేదు. కానీ.. తిట్ల పురాణం మొదలు పెట్టావ్ అంటూ హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పై మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. ఇక్కడ బీజేపీ మనుషులు లేరు. మహబూబ్ నగర్ నుండి వచ్చి చెప్తే నమ్మే స్థితిలో హుజురాబాద్ ప్రజలు లేరు. అబద్ధాలతో ఓట్లు పడవని తెలుసు రాజేందర్.. హుజురాబాద్ ప్రజల ఓట్లు గెల్లు శ్రీనుకే అన్నారు మంత్రి.

Harish Rao Punches To Etala Rajender
Harish Rao Punches To Etala Rajender

హుజురాబాద్ లో గెలిచే వ్యక్తి గెల్లు శ్రీను.. గెలిచే గుర్తు కారు. ఈ విషయం గుర్తుంచుకో అంటూ ఈటలకు పంచ్ వేశారు హరీష్. గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలిస్తే హుజురాబాద్ ప్రజలకు లాభం.. ఈటల రాజేందర్ గెలిస్తే ఆయనకు మాత్రమే లాభం. హుజురాబాద్ పట్టణంలో 60 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కేంద్రమంత్రులు వట్టి చేతులతో వస్తున్నారు. హుజురాబాద్ నియోజకవర్గానికి కేంద్రం చేసింది ఏమీ లేదన్నారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపిస్తే 15 రోజులకు ఒక్కసారి హుజురాబాద్ వస్తాం.. బాజాప్తా అభివృద్ధిని కొనసాగిస్తాం. ఈటల రాజేందర్ గెలిస్తే ఇటు మొఖాన కూడా రాడు అంటూ సెటైర్లు వేశారు మంత్రి హరీష్. దేశంలో ప్రభుత్వ సంస్థలను అమ్ముతున్నది బీజేపీ ప్రభుత్వం. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రజలకు తెలుసు ఏ పార్టీని గెలిపించాలో అన్నారు మంత్రి.