పెళ్లై మూడేళ్లైనా ఏదో కారణంతో ఆ కార్యం వద్దంటుండు! ఏంటా అని తెలుసుకుంటే అది అసలు విషయం. - TNews Telugu

పెళ్లై మూడేళ్లైనా ఏదో కారణంతో ఆ కార్యం వద్దంటుండు! ఏంటా అని తెలుసుకుంటే అది అసలు విషయం.అతనో బ్యాంక్ ఎంప్లాయ్. ఏజ్ 31. మూడేళ్ల క్రితం సాప్ట్ వేర్ ఎంప్లాయ్ తో పెళ్లైంది. కానీ వారికి శోభనం జరగలేదు. ఇంత వరకు అతను తన భార్యను టచ్ చేయలేదు. పెళ్లైనా వెంటనే శోభనం జరపాల్సి ఉన్నప్పటికీ ఏదో కారణం చెప్పి తప్పించుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఎన్నిసార్లైనా ఇలాగే చేస్తున్నడు. ఎక్కువ కట్నం కావాలంటూ వంక పెడుతున్నాడు. ఎంత అదనంగా కట్నం ఇచ్చినా సరే ఇదే తంతు. దీంతో భార్యకు అనుమానం వచ్చింది. ఎప్పుడూ ఫోన్ లో భర్త బిజీగా ఉండటంతో అసలు సంగతేంటో తెలుసుకోవాలనుకుంది. ఓ రోజు భర్త ఫోన్ లాక్కొని చూసి షాక్ అయ్యింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా విడాకులు కావాలంటూ కోర్టుకు ఎక్కింది.

వివరాల్లోకెళితే

కర్ణాటక లోని బసవన్న గుడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. వీరిద్దరికీ 2018 లో పెళ్లైంది. భర్త తనను కాదని వేరే అమ్మాయితో సంబంధం ఏమైనా పెట్టుకున్నాడేమోనని ఆ భార్య భావించింది. కానీ ఫోన్ చూస్తే మొత్తం బండారం బయటపడింది. తనో గే. అమ్మాయిలంటే అతనికి పడదు. స్వలింగ సంపర్కం అంటేనే అతనికి ఇష్టం. ఫోన్ లో ఇంకో మగ వ్యక్తితో చాటింగ్ ను ఆ భార్య చూసింది. అంతేకాదు గే యాప్ లలో ఆయన ప్రొఫైల్ ఉంది. చాలా మంది మగవాళ్లతో శృంగారపరమైన చాటింగ్ కు ఫోన్ లో ఉంది. దీంతో ఆ భార్య అతన్ని నిలదీసింది. మొత్తం యవ్వారం బయటపడటంతో  నిజం ఒప్పుకోకతప్పలేదు.

ఇది రెండో పెళ్లి

ఐతే ఇతగాడికి ఇదే రెండో పెళ్లి. మొదటి భార్య కూడా ఇదే కారణంతో వదిలేసి ఉండవచ్చని ఆ భార్య అనుమానం వ్యక్తం చేస్తోంది. తన కుటుంబ సభ్యులకు ఇది రెండో పెళ్లి అన్న సంగతి తనకు చెప్పలేదంటూ ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయటంతో పాటు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది.