యాలకుల వల్ల లాభాలివే.. నిపుణులేమంటున్నారంటే - TNews Telugu

యాలకుల వల్ల లాభాలివే.. నిపుణులేమంటున్నారంటేHealth Benefits From Elachi
Health Benefits From Elachi

గత వారం, పది రోజులుగా ఇలాచీ, యాలకులు అనే పదం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఎవరి నోటా విన్నా యాలకులు అనే పదమే వినిపిస్తోంది. అయితే.. యాలకుల వల్ల ఎన్నో లాభాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. వంటలో రుచిని పెంచడమే కాదు.. ఇలాచీ వల్ల ఆరోగ్యానికి కూడా ఎన్నో లాభాలున్నాయి. యాలకులు జేబులో వేసుకుంటే డబ్బులొస్తాయో.. రావో అనే విషయం పక్కన పెడితే నోట్లో వేసుకుంటే మాత్రం నోటి దుర్వాసన తగ్గుతుంది.

Health Benefits From Elachi
Health Benefits From Elachi

 

 • యాలకులు నానబెట్టిన నీళ్లు తాగితే ఆరోగ్యానికి, జీర్ణ వ్యవస్థకు ఎంతో మంచిదంటున్నారు ఆయుర్వేద నిపుణులు.
 • రోజుకో ఇలాచీ తింటే.. జీర్ణక్రియ పనితీరు మెరుగు పడుతుంది. కడుపులో గ్యాస్ సమస్యలు మటుమాయం అవుతాయి.
 • లీటర్ నీటిలో కొన్ని యాలకులు వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయానే వాటిని గోరువెచ్చని నీటితో కలిపి తాగాలి. ఇలా రోజుకు 2 నుంచి 3 సార్లు తాగొచ్చు. ఉదర సంబంధ వ్యాధులు తగ్గిపోతాయి. షుగర్ కూడా అదుపులో ఉంటుంది.
 • ఇలాచీలో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఇది సహయపడుతుంది.
Health Benefits From Elachi
Health Benefits From Elachi

 

 • యాలకుల్లోని ఆయుర్వేద గుణాలు రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.
  యాలకులు నానబెట్టిన నీరు తాగితే.. రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇందులోని ఔషద గునాలు శరీర అలసటను కూడా తగ్గిస్తాయి.
 • యాలకుల నీరు వివిధ రకాల పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు సమృద్ధిగా ఉండడం వలన శరీరంలో నిల్వ ఉన్న అదనపు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా.. బరువును తగ్గించడంలోనూ సహయపడుతుంది.
 • ఒళ్లు నొప్పులకు యాలకులు మంచి ఔషధం. యాలకులు బాగా నూరి నుదురుకి లేపనం వేస్తే తలనొప్పి చిటికెలో మాయమవుతుంది. 
Health Benefits From Elachi
Health Benefits From Elachi

 

 • యాలకులు కషాయంలా చేసి తాగితే.. దగ్గు నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది.
 • యాలకుల గింజలు నోటితో నమలటం వల్ల క్రిములు నశించడమే కాకుండా నోటి దుర్వాసనను అరికట్టి.. దంతాలను, చిగుళ్ళను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.
 • యాలకుల పేస్టును గాయాలకి, పుండ్లకు లేపనంలా వేస్తే నొప్పి, గాయం తొందరగా మానిపోతాయి.
 • యాలకులలో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి 1, బి 6, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర కొవ్వును కరిగిస్తుంది.