ఎండాకాలం చెరుకు రసం తాగితే ఎన్ని లాభాలో..

వేసవికాలం స్టార్ట్ అయింది.. అప్పుడే ఎండలు దంచి కొడుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో నాలుగు అడుగులు వేయాలంటే చెమటలు వరదలై పారుతున్నాయి. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు గొంతు తడుపుకోవడం, చల్లటి పానీయాలు తాగడం ఎండాకాలం కామనే. ఎండలకు బాడీ డిహైడ్రేషన్ కావొద్దంటే కంటిన్యూగా నీళ్లు తాగడం తప్పనిసరి. అయితే.. వేసవిలో ఎక్కడ పడితే అక్కడ కనిపించే చెరుకు రసం చూడగానే.. మనకు తెలియకుండానే గొంతులో దాహం.. మనసులో చెరుకు రసం తాగాలన్న కోరిక పుడుతుంది.

  • ఎండాకాలంలో చెరుకు రసం తాగడం వల్ల వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. చెరుకు రసం వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయి.
  • కాలేయం సమస్యలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, రక్తపోటు ఉన్నవారికి చెరుకు రసం చాలా మంచిది.

  • ఎముకలను బలపరిచే కాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి అనేక రకాల పోషకాలు చెరుకు రసంలో ఉంటాయి.
  • చెరుకు రసం జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇందులోని పొటాషియం జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. కడుపులో ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది.

  • కాల్షియం, ఫాస్పరస్ వంటి ఖనిజ లవణాలు చెరుకు రసంలో పుష్కలంగా ఉంటాయి.
  • చెరుకు రసంలోని కాల్షియం దంతాలను బలంగా చేస్తుంది. పంటి మీది ఎనామిల్ పొర దెబ్బతినకుండా కాపాడుతుంది. నోటి దుర్వాసనకు చెక్ పెడుతుంది.

  • జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నప్పుడు  ఒక గ్లాస్ చెరకు రసం తాగడం వల్ల ఈ జబ్బుల నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు.
  •  చెరుకు రసాన్ని వారంలో మూడుసార్లు తీసుకుంటే చాలా మంచిది. ఇది సహజ డిటాక్స్‌గా పని చేస్తుంది.