కరోనాపై ఉన్నతాధికారులతో మంత్రి ఈటల సమీక్ష

Health Minister Etala Rajender Review Meet About Corona Spread
Health Minister Etala Rajender Review Meet About Corona Spread

రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందని, ఆర్టీపీసీఆర్‌ టెస్టుల సంఖ్యను పెంచాలని అధికారులను మంత్రి ఈటల ఆదేశించారు. కేసులు పెరిగితే రోగులకు సరిపడా ఆస్పత్రులను సిద్ధంగా ఉంచాలని సూచించారు. గాంధీ ఆస్పత్రి కొవిడ్‌ వార్డులు సిద్ధంగా ఉంచి అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.

Health Minister Etala Rajender Review Meet About Corona Spread
Health Minister Etala Rajender Review Meet About Corona Spread

పీపీఈ కిట్లు, మాస్క్‌లు, ఔషధాలు అందుబాటులో ఉంచాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రోజుకు 50వేల కరోనా పరీక్షలు చేస్తున్నామని.. కొవిడ్‌ పరీక్షల సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ట్రీట్‌మెంట్‌ పకడ్బందీగా జరగాలి అధికారుకు సూచనలు చేశారు. కేసులు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి రావొద్దని మంత్రి ప్రజలను కోరారు.