చౌటుప్పల్ లో భారీ అగ్నిప్రమాదం.. భారీగా కమ్ముకున్న పొగలు

Heavy Fire accident Happened In Chowtuppal darmoji guda facory
Heavy Fire accident Happened In Chowtuppal darmoji guda facory

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండల పరిధిలోని ధర్మోజిగూడలో ఉన్న ఆగ్రో కెమికల్ ఫ్యాక్టరీలో ఈ మంటలు చెలరేగాయి. గురువారం నాడు ఉదయం ఫ్యాక్టరీలో మరమ్మత్తు పనులు చేస్తున్నారు.

Heavy Fire accident Happened In Chowtuppal darmoji guda facory
Heavy Fire accident Happened In Chowtuppal darmoji guda facory

ఈ క్రమంలో వెల్డింగ్ చేస్తుండగా నిప్పు రవ్వలు ఎగిరిపడి మంటలు అంటుకున్నాయి. చూస్తుండగానే మంటలు వేగంగా వ్యాపించాయి. అది రసాయన ఫ్యాక్టరీ కావడంతో పరిశ్రమ మొత్తం విస్తరించి మంటలు ఎగిసిపడుతున్నాయి. చుట్టుపక్కల భారీగా పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో లోపల ఎంతమంది ఉన్నారనే విషయం ఇంకా తెలియదు. వివరాలు తెలియాల్సి ఉంది.