రాష్ట్రంలో పలుచోట్ల జోరుగా వానలు

 

నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల జోరు వానలు పడుతున్నవి. హైదరాబాద్ తోపాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడుతోంది. రాష్ట్రమంతటా నైరుతి రుతుపవనాలు విస్తారించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

నగరంలోని గచ్చిబౌలి, మాదాపూర్, మియాపూర్, చందానగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సోమాజిగూడా, అమీర్పేట్, సనత్ నగర్, నాంపల్లి, గోశామహల్,బషీర్బాగ్, అప్జల్ గంజ్, నారాయణ గూడ, మెహిదిపట్నం, మాసబ్ ట్యాంక్, టోలిచౌకి, వారసిగూడా, సీతాఫల్ మండి, బౌద్ధ నగర్ తదితర ప్రాంతాలలో మోస్తరుగా కురుస్తున్న వర్షం.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల, మహాదేవపూర్, కాటారం, మహా ముత్తారం, మల్హర్ రావు మండలాల్లో.. మహబూబ్ నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో.. పెద్దపల్లి జిల్లా మంథని, ముత్తారం, రామగిరి, కమాన్ పూర్ మండలాల్లో… వికారాబాద్ జిల్లా తాండూరులో… ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో… నిజామాబాద్ జిల్లా అర్ముర్, బాల్కొండ, బోధన్ మండలాల్లో… వికారాబాద్ జిల్లా పరిగిలో… వరంగల్ రూరల్ జిల్లా పరకాల డివిజన్… రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో.. వరంగల్ నగరం… కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్, మనకొండూర్, గన్నేరువరం, శంకరపట్నం మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుంది.

జనగామ జిల్లా జనగామ, నర్మెట్ట, లింగాలఘణపురం, తరిగోప్పుల, బచ్చన్మపేట, స్టేషన్గన్పూర్, రఘునాథపల్లి , చిల్పూర్, జఫర్గడ్ మండలాల పరిధిలోని పలు గ్రామాలలో… వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ వేలేరు మండలంలో… వికారాబాద్ జిల్లా కొడంగల్ లో… యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట, వెలిగొండ, బిబినగర్ మండలాల్లో… సిద్దిపేట జిల్లా సిద్దిపేటలో వానలు పడుతున్నాయి.