తిరుమలలో విస్తారంగా వర్షాలు.. ఘాట్ రోడ్ మూసివేత

Tirumala

తిరుమలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఘాట్ రోడ్డులలో టీటీడీ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. నాలుగ చక్రాల వాహన రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి.

వర్షం నిలిచిన సమయాలలో బైక్ లను టీటీడీ విజిలెన్స్ విభాగం అనుమతిస్తుంది. రాత్రి 7 గంటల వరకూ బైక్స్, 10 గంటల వరకు ఫోర్ వీలర్స్ ను ఘాట్ రోడ్లలో అనుమతి ఇస్తున్నారు.

రాత్రి 10 గంటలకు ఘాట్ రోడ్డును టీటీడీ మూసివేయనున్నది. తిరిగి మరుసటిరోజు వేకువజామున 2 గంటలకు ఘాట్ రోడ్డును తెరవనున్నారు.