హిమపాతం ధాటికి.. అమెరికా గజగజ

హిమపాతం ధాటికి.. అమెరికా గజగజ
హిమపాతం ధాటికి.. అమెరికా గజగజ

అమెరికాను మంచుతుఫాను ముంచేస్తోంది. హిమపాతం ధాటికి దక్షిణాది రాష్ట్రాలు గజగజా వణికిపోతున్నాయి. భారీగా కురుస్తున్న మంచుతో జనజీవనం మొత్తం అస్తవ్యస్తమయింది. పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు.

15 కోట్ల మంది అమెరికన్లు మంచు ముప్పులో చిక్కుకున్నారు. టెక్సాస్, అలబామా, ఒరెగాన్, ఒక్లహోమా, కాన్సస్, కెంటకీ, మిసిసిపీ,లూసియానా, డల్లాస్‌ రాష్ట్రాల్లో ఎమర్జెన్సి విధించారు. టెక్సాస్‌ లో విద్యుత్‌ ప్లాంట్లు సరిగా పని చేయడం లేదు. పైపుల్లో నీరు గడ్డ కట్టి.. నీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.టెక్సాస్‌ రాష్ట్ర గవర్నర్‌ నేషనల్‌ గార్డ్‌ సాయం కోసం ప్రకటించారు. విద్యుత్ పొదుపుగా వాడుకోవాలని.. కన్సాస్‌ గవర్నర్‌ ఇప్పటికే పౌరులకు విజ్ఞప్తి చేశారు.