
మా ఎన్నికలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న నటులు ఒకరి మీద ఒకరు కామెంట్లు, విమర్శలు చేసుకుంటూ రాజకీయ పార్టీల ఎన్నికలను తలపిస్తున్నారు. ఒకవైపు ప్రకాష్ రాజ్ ప్యానెల్.. మరోవైపు మంచు విష్ణు ప్యానెల్ మా ఎన్నికలను వేడెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే నటి హేమ ఓ అడుగు ముందుకేసింది. నటి కరాటే కల్యాణి మీద మాధాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తన పరువుకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారని.. వ్యాఖ్యలు చేస్తున్నారని వీకే నరేష్, కరాటే కల్యాణిల మీద హేమ ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదును స్వీకరించిన మాధాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.