మా ఎన్నికల్లో కలకలం.. నరేష్, కళ్యాణిల పై పోలీస్ కంప్లైంట్.. నటి హేమ సంచలన ఆరోపణలు..!

hema police complaint on actor naresh and karate kalyani
hema police complaint on actor naresh and karate kalyani

మా ఎన్నికల రాజకీయాలు రసవత్తరంగా జరుగుతున్నాయి. ఒకర్నొకరు ఇష్టమొచ్చినట్టు తిట్టుకుంటూ.. శాపనర్దాలు పెట్టుకుంటున్నారు. మీడియా ముఖంగా కన్నీళ్లు కారుస్తున్నారు. సినిమాల్లో ఎమోషనల్ సీన్స్ మాదిరి డ్రామాని తెగ పండించేస్తున్నారు. ఇదంతా చూస్తున్న జనాలకి మాత్రం కాస్త ఇబ్బెట్టుగా అనిపిస్తుంది. ఇక ఈ మా ఎలెక్షన్స్ లో ఆత్మగౌరవం నినాదంతో మంచు విష్ణు సెంటిమెంట్ రాజకీయాలకి తెరలేపుతే.. మేము పనిచేస్తాం మాకొక అవకాశమివ్వండి అంటున్నాడు ప్రకాష్ రాజ్. ఇక ఇన్ని గొడవల మధ్యలో తాజాగా మా ఎన్నికల్లో మరో కలకలం చెలరేగింది. సీనియర్ నటుడు నరేష్, కరాటే కళ్యాణిలపై నటి హేమ పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. దీంతో మరోసారి        మా రాజకీయాల్లో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. పైకి మేమంతా ఒక కుటుంబమనే వీరు పోలీస్ కంప్లైంట్ వరకు వెళ్లిపోయారు. తన ఫోటోలని మార్ఫింగ్ చేసి.. నరేష్, కరాటే కళ్యాణిలు సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని నటి హేమ హైదరాబద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కానీ హేమ ఆరోపణలని కొట్టిపడేసింది కరాటే కళ్యాణి.