సంక్రాంతి పండుగను బాగా ఎంజాయ్ చేస్తున్నారు హీరో నందమూరి బాలకృష్ణ. సంక్రాంతి రోజున తన సోదరి పురంధేశ్వరి అత్తారిల్లు అయిన కారంచేడుకు వెళ్లిన బాలయ్య.. అక్కడ సరదాగా గుర్రమెక్కి.. ఆ తర్వాత ఎడ్ల బండి నడిపి అందరిని ఆహ్లాదపరిచారు. తాజాగా ఆయన బీచ్ లో జీపు పై చక్కర్లు కొట్టారు. కారంచేడుకు సమీపంలోని చీరాల బీచ్ కు వెళ్లి సందడి చేశారు. ఈ బీచ్ లో తన సతీమణి వసుంధరతో కలిసి జీపులో చక్కర్లు కొట్టారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
రైడ్ కు వెళుతున్న సమయంలో బాలయ్య థమ్స్ అప్ చూపిస్తే.. ఆయన సతీమణి వసుంధర మాత్రం టాటా చెప్పారు. దాంతో భార్యను టాటా చెప్పకూడదు.. థమ్స్ అప్ చెప్పాలని.. టాటా చెప్పటం అంటే.. సముద్రంలోకి వెళ్లటమే అని సరదాగా అన్నారు బాలయ్య. ఇక ఈ వీడియోను నందమూరి అభిమానులు తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేస్తూ.. మా బాలయ్య బంగారం అంటూ కామెంట్లు పెడుతున్నారు.