తమిళ చిత్ర సీమలో.. తీవ్ర వివాదంగా హీరో శింబు.. సీఎం స్టాలిన్ ఇంటి ముందు నిరాహారదీక్ష.. అసలేం జరిగిందంటే..!

Hero Simbu Parents To Go On Strike In Front Of Tamil Nadu CM Stalin's House
Hero Simbu Parents To Go On Strike In Front Of Tamil Nadu CM Stalin's House
Hero Simbu Parents To Go On Strike In Front Of Tamil Nadu CM Stalin's House
Hero Simbu Parents To Go On Strike In Front Of Tamil Nadu CM Stalin’s House

తమిళనాడులో అత్యంత వివాదాస్పద హీరోగా ముద్రపడ్డాడు శింబు. హీరోయిన్స్ నయనతార, హన్సికలతో లవ్ అఫైర్స్, దుందుడుకు ధోరణితో నిత్యం అరవ మీడియాలోనే కాదు తెలుగులోనూ ట్రెండ్ అవుతూ ఉంటాడు శింబు. అయితే ఇప్పుడు తాజాగా నిర్మాతల మండలితో హీరో శింబు వివాదం తారాస్థాయికి చేరింది. శింబు 2017లో నటించిన ‘అన్బానవన్‌ అడంగాదవన్‌ అసరాదవన్‌’ చిత్ర వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ వివాదంలోకి శింబు తల్లి తండ్రుల ఎంట్రీ మరింత హీట్ పెంచింది. ఈ చిత్రాన్ని నిర్మాత మైఖేల్ రాయప్పన్ నిర్మించారు. ఈ చిత్రం విషయంలో శింబు నిర్లక్ష్య వైఖరి తనకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని.. కాబట్టి శింబు తనకు నష్టపరిహారం చెల్లించాలి అంటూ రాయప్పన్ నిర్మాతల మండలిని ఆశ్రయించారు. అయితే ఎన్నో విచారణల అనంతరం శింబు వెంటనే రాయప్పన్ కి నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలిచ్చింది. దీనితో పాటు సినీ కార్మికులు కూడా శింబు చిత్రాలకి పనిచేయకుండా కార్మికుల సంఘం ఆదేశాలిచ్చింది. ఈ సంఘం అధ్యక్షుడు నటి రోజా భర్త సెల్వమణి ఈ ప్రకటన చేశాడు.

ఇక శింబు నటించిన ‘మనాడు’ చిత్రం త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ స్థాయిలో తెరకెక్కగా.. ఈ చిత్రం విడుదలపై అనేక వివాదాలు చెలరేగుతున్నాయి. శింబు ‘మనాడు’ విడుదల సమయానికే రజినీకాంత్ ‘అన్నాత్తే’, విశాల్ ‘ఎనిమి’ చిత్రాలు విడుదలవుతున్నాయి. దీంతో శింబు తన చిత్రాన్ని పోస్ట్ పోన్ చేసుకోవాలి అంటూ నిర్మాతల సంఘం నుండి హెచ్చరికలు వస్తున్నాయట. దీంతో నిర్మాతల మండలి కావాలనే తన కొడుకు చిత్రాన్ని తొక్కయ్యాలని చూస్తున్నారని శింబు తల్లి తండ్రులు టి రాజేందర్, ఉషా రాజేందర్ లు బుధవారం మీడియా ముందుకు వచ్చి సంచలన కామెంట్స్ చేశారు. తన కొడుకు ఎదుగుదలని సహించక .. కొందరు కుట్రలు పన్నుతున్నారని.. తన కొడుకు చేయని తప్పుకి నష్టపరిహారం చెల్లించాలంటూ నిర్మాతల మండలి ఒత్తిడి చేస్తుందని.. అసలు రాయప్పన్ తన కొడుకుకి మొత్తం రెమ్యునరేషన్ చెల్లించనప్పుడు.. నా కొడుకు నష్టపరిహారం ఎందుకు ఇవ్వాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కొడుకుపై చేస్తున్న కుట్రని వెంటనే సీఎం స్టాలిన్ దృష్టికి తీసుకెళ్తామని.. న్యాయం దక్కని పక్షంలో సీఎం ఇంటిముందు నిరాహారదీక్షకు సైతం దిగుతామని హెచ్చరికలు చేసారు శింబు తల్లితండ్రులు.