ఆ నగ్న చిత్రాలను షేర్ చేస్తూ.. బూతు సందేశాలపై.. మండిపడ్డ హీరోయిన్ అనుపమ..! - TNews Telugu

ఆ నగ్న చిత్రాలను షేర్ చేస్తూ.. బూతు సందేశాలపై.. మండిపడ్డ హీరోయిన్ అనుపమ..!Heroine Anupama Parameswaran Sensational Post About Body Shaming
Heroine Anupama Parameswaran Sensational Post About Body Shaming

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.. వయసు చిన్నదే కానీ పరిణితి కలిగిన నటిగా మంచి పేరు తెచ్చుకుంది. తెలుగు, మలయాళంలో వరుసపెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉండే అనుపమ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. తన తమ్ముడితో డాన్స్ లు చేస్తూ, పాటలు పాడుతూ.. హల్చల్ చేసే వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసే అనుపమ.. సామజిక అంశాలపై కూడా స్పదింస్తుంటుంది. ముఖ్యంగా తనపై ట్రోల్ చేసే వారిని, మహిళలపై అసభ్యకర భాష మాట్లాడేవారిపై కూడా ఘాటుగా రియాక్ట్ అవుతూ ఆలోచింపచేస్తుంది అనుపమ.

సోషల్ మీడియాలో ఒకవైపు సందడి చేస్తూనే, సామజిక అంశాలపై కూడా స్పందిస్తుండటం అనుపమలోని పరిణితికి నిదర్శనం. మొన్న ఒక మరాఠి నటి హేమంగి లోదుస్తులపై కామెంట్స్ చేసి అవమానపరిచిన వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అనుపమ లేటెస్ట్ గా మహిళల శరీరాకృతి, ఆడవారిపై చేసే వివక్షపూరిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రాసిన ఓ పోస్ట్‌ను షేర్ చేశారు. కొన్ని బూతు చిత్రాలని షేర్ చేస్తూ..మహిళలను ఎలా టార్గెట్ చేస్తారో వివరించింది అనుపమ.

మహిళలు ఎలా ఉండాలో అందరు డిసైడ్ చేసే వారే.. ఎంత తినాలో ఎం తినాలో కూడా చెప్తుంటారు. తక్కువగా తినండి అని కొందరు, ఎక్కువగా తినండి కొంచం పర్సనాలిటీ పెంచండి అంటూ మరికొందరు, లావుగా ఉండకండని ఇంకొందరు నిర్దేశిస్తుంటారు. మహిళలు నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా, ఎలా ఉన్నా కూడా కామెంట్స్ చేస్తుంటారు. అమ్మాయిలు ఇలా ఉండాలి, అలా ఉండకూడదు.. లావు అవ్వొద్దు , సన్నగా ఉండాలి, జీరో సైజ్ కావాలి ఇలా మహిళలకు అడుగడునా ఆంక్షలు పెడతారంటూ ఆలోచింపచేసేలా కొన్ని ఫోటోలని షేర్ చేస్తూ.. అనుపమ పోస్ట్ పెట్టింది.

అందరిని ఆలోచింపచేసేలా పోస్టులు పెట్టిన అనుపమ.. మహిళలపై జరుగుతున్న ట్రోలింగ్ కి తానెంత వ్యతిరేకమో.. తానూ షేర్ చేసిన కొన్ని ఫొటోలతో చెప్పకనే చెప్పేసింది. అమ్మాయిల శరీర భాగాలను విమర్శిస్తూ కామెంట్స్ చేసేవారికి బుద్దొచ్చేలా అనుపమ చేసిన పోస్ట్ కి సోషల్ మీడియాలో పెద్దఎత్తున సపోర్ట్ వస్తుంది. ఎలాంటి బట్టలు వేసుకోవాలో అమ్మాయిలా ఛాయిస్, ఎలా కనిపించాలో మహిళల పర్సనల్ మ్యాటర్ అని సొసైటీ గుర్తించాలని అనుపమ చేసిన పోస్ట్ కి కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. మహిళలపై వివక్షపూరితమై కామెంట్లు చేసే వారిని మేల్కొలిపే విధంగా ఉన్న అనుపమ పోస్ట్‌లు నెట్టంట్లో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.