గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన హీరోయిన్ డింపుల్

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో చాలా మంది సెలబ్రిటీలు, సినిమా ప్రముఖులు పాల్గొంటూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ ఫుల్ చేస్తున్నారు. ఎంపీ సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపు స్పూర్తితో నటి డింపుల్ హయతి కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ లో మొక్కలను నాటారు. ఆ తర్వాత ఆమె హీరో రవితేజ, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, నటి మీనాక్షిలకు మొక్కలు నాటాలంటూ ఛాలెంజ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ పర్యావరణ పరిరక్షణకు ఎంతో కృషి చేస్తున్నారని..ఇలాంటి మంచి కార్యక్రమంలో భాగమవటం సంతోషంగా ఉందని ఆమె హీరోయిన్ డింపుల్ అన్నారు.