బైక్‌ కవర్‌ వేసుకున్నావా.. గొంగడి కప్పుకున్నావా.. హీరోయిన్ కాజోల్ డ్రెస్సింగ్ పై విమర్శలు..!

Kajal brutally trolled by netizens
Kajal brutally trolled by netizens
Kajal brutally trolled by netizens
Kajol brutally trolled by netizens

ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ తన అందచందాలతో కుర్రకారుని ఒక ఊపుఊపేసింది. ముఖ్యంగా షారుఖ్ ఖాన్, కాజోల్ కాంబినేషన్ లో వచ్చిన దిల్ వాలే దుల్హనియా లేజాయింగే, కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషి కభీ గం వంటి సినిమాలు క్లాసిక్ హిట్స్ గా నిలిచాయి. మంచి ఫార్మ్ లో ఉన్నప్పుడే మరో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ని ప్రేమ వివాహం చేసుకుని గ్లామర్ పాత్రలకి గుడ్ బై చెప్పేసింది కాజోల్. పెళ్లి తరువాత అడపా దడపా సినిమాలు చేస్తూ వస్తున్న కాజల్.. ఇప్పటికీ 47ఏళ్ళ వయసులోనూ కుర్ర హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ తన బ్యూటీతో అదరగొడుతూనే ఉంటుంది కాజల్. తాజాగా ఓ అవార్డు ఫంక్షన్‌కి వచ్చిన ఈమెని వీపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు నెటిజన్లు.దీనికి కారణం ఈ ఫంక్షన్ లో కాజల్ వేసుకున్న డ్రెస్. కొంచం వింతగా పైనుండి అదేదో గొంగడి కప్పుకున్నట్టు కనిపిస్తున్న ఈ డ్రెస్ పై నెటిజన్స్ ఫన్నీ ట్రోల్ల్స్ చేస్తున్నారు.

డ్రెసింగ్‌, హెయిర్ స్టైల్‌ వంటి వాటిలో ఎప్పుడూ ప్రయోగాలు చేసే కాజోల్‌.. తాజాగా దుబాయ్‌లో జరిగిన ఓ అవార్డు ఫంక్షన్‌లో బాడీ-కాన్ బ్లాక్ గౌన్ ధరించి రెడ్‌ కార్పెట్‌పై నడవగా ఈసారి కాజల్ ప్రయోగం కాస్త బెడిసికొట్టింది అంటున్నారు నెటిజన్స్. ఆమె డ్రెస్సింగ్ స్టైల్ అభిమానులకి ఏ మాత్రం నచ్చనట్టే కనిస్పిస్తుంది. దీంతో విపరీతంగా ట్రోల్‌ చేశారు. ‘ఆమె నా బైక్‌ కవర్‌ వేసుకొచ్చింది’ అని ఒకరు అనగా.. ‘అది బ్లాంకెట్‌లా ఉంది.. అవార్డు రాకపోతే అది కప్పుకొని పడుకోవచ్చు’ అంటూ కామెంట్‌ చేశారు. ఇక ఇంకొందరైతే డ్రెస్సింగ్ విషయంలో కాజల్ మరింత అప్డేట్ అవుతే బెటర్ అని.. బాలీవుడ్ ఫ్యాషన్ క్వీన్స్.. సోనమ్ కపూర్, దీపికా పదుకొనేలను డ్రెసింగ్ విషయంలో ఫాలో అవుతే బెటర్ అని సోషల్ మీడియాలో కాజల్ కి సలహాలు ఇస్తున్నారు నెటిజన్స్.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)