హైదరాబాద్ టు ముంబై ప్రయాణం.. ఇకపై జస్ట్ 3 గంటలే - TNews Telugu

హైదరాబాద్ టు ముంబై ప్రయాణం.. ఇకపై జస్ట్ 3 గంటలేHigh Speed Rail Service Will Started Soon Hyderabad Between Maharashtra Soon
High Speed Rail Service Will Started Soon Hyderabad Between Maharashtra Soon

హైదరాబాద్ కి మెట్రో రైలు సౌకర్యం నగర ప్రజలకు ఎంతో ఉపయోగపడింది. దూరప్రయాణాలు చేసే వారికి కంఫర్ట్ గా, టైమ్ కి గమ్యస్థానానికి చేరుకునేలా వివిధ రంగాల్ల పనిచేసే వారికి ఎంతో సౌకర్యంగా ఉంది. అలాంటిదే.. కాకపోతే మరింత స్పీడ్ తో మరో రైలు సర్వీసు హైదరాబాద్ కి రాబోతోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబైకి కేవలం 3 గంటల్లోనే చేర్చే బుల్లెట్ రైలు సర్వీస్ ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకు గల సాధ్యాసాధ్యాలపై సర్వే కూడా పూర్తయిందట.

High Speed Rail Service Will Started Soon Hyderabad Between Maharashtra Soon
High Speed Rail Service Will Started Soon Hyderabad Between Maharashtra Soon

మామూలుగా అయితే 3 గంటలు.. బుల్లెట్ ట్రైన్ లో 3 గంటలే
మామూలుగా అయితే హైదరాబాద్ నుంచి ముంబై చేరుకోవాలంటే 650 కి.మీ ప్రయాణించాలి. ఇందుకు దాదాపు 14 గంటల సమయం పడుతుంది. అంతదూరం, అంత సమయం ప్రయాణించాలంటే చాలా ఇబ్బంది పడేవారు. అయితే.. ఇప్పుడు రాబోతున్న హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ లో జస్ట్ 3 గంటల్లోనే ముంబై చేరుకోవచ్చు.

High Speed Rail Service Will Started Soon Hyderabad Between Maharashtra Soon
High Speed Rail Service Will Started Soon Hyderabad Between Maharashtra Soon

11 స్టేష‌న్లు దాటి.. కూ.. చుక్ చుక్ అంటూ..
హైదరాబాద్ నుంచి ముంబై మధ్య బుల్లెట్ రైలు త్వరలో అందుబాటులోకి వస్తుందని మహారాష్ట్రలోని థానే జిల్లాల ప్రజలు ఇప్పటికే సంబరాలు చేసుకుంటున్నారు. కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడమే ఆలస్యం హై స్పీడ్ రైల్వే ట్రాక్ పనులు ప్రారంభమవుతాయి. ఈ బుల్లెట్ ట్రైన్ మహారాష్ట్రలోని 11 రైల్వే స్టేషన్లు దాటి ముంబై, పూణెలను కలుపుతూ.. హైదరాబాద్ చేరుకుంటుందని నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పోరేషన్ అధికారులు చెప్తున్నారు.

High Speed Rail Service Will Started Soon Hyderabad Between Maharashtra Soon
High Speed Rail Service Will Started Soon Hyderabad Between Maharashtra Soon

650 కి.మీ గ్రీన్ కారిడార్
హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రయాణించే రైలు పరిధిలో మొత్తం 649.76 కిలోమీటర్లు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నామని థాణే భూ సేకరణ విభాగం డిప్యూటీ కలెక్టర్ ప్రశాంత్ సూర్యవంశీ, ఇతర అధికారులకు ఇప్పటికే నివేదికలు సమర్పించారు. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపో్ట్ సిద్ధం చేస్తున్నామని నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పోరేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎన్.కే. పాటిల్ తెలిపారు.

థానేలో పూర్తయిన భూ సేకరణ
ఇప్పటికే రైలు మార్గం కోసం థానేలో 1200 హెక్టార్ల భూమి సేకరించారు. ఈ హై స్పీడ్ రైలు ప్రాజెక్టు నిర్మాణం థానేతో పాటు నేవీ ముంబై, పూణె, పందార్ పూర్, షోలాపూర్, గుల్బర్గ, వికారాబాద్, హైదరాబాద్ ల మీదుగా జరుగుతుంది. మహారాష్టరలోని థానే, రాయ్ గఢ్, పూణె, షోలాపూర్ నాలుగు జిల్లాల మీదుగా ఈ ప్రాజెక్టు సాగుతుంది.