రోజూ మారే బంగారం ధరలు ఎలా డిసైడ్ అవుతాయో తెలుసా? - TNews Telugu

రోజూ మారే బంగారం ధరలు ఎలా డిసైడ్ అవుతాయో తెలుసా?మగువలకు అత్యంత ఇష్టమైనది బంగారం. ఎవరైనా స్వచ్ఛమైన మనసున్న వారు ఉంటే.. వారిని బంగారంలాంటి మనిషి అని పిలుస్తారు. బంగారం ఉందంటే.. మన చేతిలో స్థిరాస్తి ఉన్నట్టే. బంగారం మీద పెట్టుబడి పెట్టిన వారికి నష్టాలంటూ రానే రావు.. ఒకవేళ వచ్చినా తక్కువ మోతాదులో వస్తాయి. అలాంటి బంగారం ధరలు మార్కెట్లో రోజూ మారుతూ ఉండటం మనం చూస్తుంటాం. ఇంతకీ ఈ బంగారం ధరలు ఎవరు నిర్ణయిస్తారు. ఎలా నిర్ణయిస్తారు? తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి.

How Was gold rates Changed Every Day
How Was gold rates Changed Every Day

కరెన్సీ తర్వాత సంపదను బంగారంతోనే కొలుస్తారు. కొన్ని వేల ఏండ్లుగా బంగారం అతి విలువైన లోహంగా కొనసాగుతోంది. భగభగమండే భూమి పొరల్లోంచి బంగారాన్ని బయటకు తీయాలంటే మామూలు విషయం కాదు. ఎన్ని రోజులైనా.. ఎన్నాళ్లు దాచుకున్నా తుప్పు పట్టదు. బరువు తగ్గదు. అందుకే అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి అంత క్రేజ్. బంగారం కోసం యుద్ధాలు, దోపిడీలు, హత్యలు జరిగిన సంగతులు అందరికీ తెలిసిందే. చేతిలో ఒక్క రూపాయి కూడా నగదు లేకపోతే.. చాలామంది తమ దగ్గరున్న బంగారాన్ని క్షణాల్లో నగదుగా మార్చుకునే సందర్భాలు నిత్యం మన కళ్లముందు కనబడుతుంటాయి. ప్రస్తుత మార్కెట్లో మణప్పురం, ఆటికా, ముత్తూట్ లాంటి ఎన్నో సంస్థలు బంగారాన్ని తీసుకొని నగదు ఇస్తున్నాయి. పైగా.. ఎలాంటి హామీ పత్రాలు కూడా అవసరం లేదు.

How Was gold rates Changed Every Day
How Was gold rates Changed Every Day

అయితే.. బంగారాన్ని ప్రేమించే, ధరించే చాలామందికి అసలు బంగారం ధర ఎవరు నిర్ణయిస్తారో తెలియదు. రిజర్వ్ బ్యాంకు, ఇంటర్నేషనల్ కంపెనీలో మార్కెట్ లో డిమాండ్ కి అనుగుణంగా బంగారం ధర నిర్ణయిస్తాయని అనుకుంటారు. కానీ.. అది నిజం కాదు. బంగారం ధర మార్కెట్లో దాని మీద పెట్టే పెట్టుబడులు, బాండ్ల ఆధారంగా పెరుగుతుంది. కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరమైన తేడాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో కూడా బంగారం ధరలు అమాంతం పెరిగాయి. దీనికి కారణం చాలామంది బంగారం మీద పెట్టుబడులు పెట్టారు. దీంతో.. బంగారానికి డిమాండ్ పెరిగి పుత్తడి ధర పెరిగిందంటున్నారు ఆర్థిక నిపుణులు.

How Was gold rates Changed Every Day
How Was gold rates Changed Every Day

బంగారాన్ని భూమి పొరల్లోంచి బయటకు తీసి.. శుద్ధి చేసేందుకు అయ్యే శ్రమ, ఖర్చు, సమయాన్ని బట్టి బంగారం ధర నిర్ణయమవుతుందట. అయితే.. బంగారం నిల్వలు తక్కువగా ఉండి డిమాండ్‌ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం ధర పెరుగుతుంది. ఎందుకంటే.. మార్కెట్లో డిమాండ్ ఉంది కాబట్టి.. కొనేవారు ఎక్కువగా ఉన్నారు కాబట్టి.. ఎక్కువ ధరకు బంగారాన్ని అమ్మాలంటే భూమిలోంచి ఎక్కువ బంగారాన్ని బయటకు తీయాలి. తక్కువ సమయంలో ఎక్కువ బంగరాన్ని ఉత్పత్తి చేయాలంటే దానికి వ్యయం ఎక్కువ అవుతుంది. అందుకే.. బంగారం ధరలో నిత్యం మార్పులు జరుగుతుంటాయని నిపుణులు చెప్తున్నారు.