ప్రియుడు అర్స్లాన్ ను పెళ్లాడబోతున్న హృతిక్ రోషన్ మాజీ భార్య?

Sussanne Khan

బాలీవుడ్ సినీ నటుడు హృతిక్ రోషన్.. తన భార్య సుసానే ఖాన్ లు విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం హృతిక్ రోషన్ బాలీవుడ్ నటి, సింగర్ సాబా అజాద్ తో డేటింగ్ చేస్తుండగా… తన ప్రియుడు అర్స్లాన్ గోనీతో సుసానే రిలేషన్ షిప్ లో ఉంది. తాజాగా సుసానే, ఆమె బోయ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకోబోతున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని… అయితే సుసానేకు ఇది రెండో పెళ్లి కావడంతో.. వీరి మ్యారేజ్ చాలా సింపుల్ గా ఉండబోతోందని ఎంటర్టైన్మెంట్ కు చెందిన ఓ మీడియా సంస్థ న్యూస్ ను ప్రచారం చేసింది.

హృతిక్ రోషన్, సుసానేలు 14 ఏళ్ల మ్యారేజ్ లైఫ్ తర్వాత  విడిపోయారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తో హృతిక్ రోషన్ కు వివాదం నడుస్తున్న సమయంలో కూడా తన మాజీ భర్తకు సుసానే మద్దతుగా నిలిచారు.