మా ఎన్నికలపై భారీ బెట్టింగ్స్.. ఇద్దరిలో గెలుపు ఎవరిదో తేలిపోయింది..!

huge betting on maa elections 2021
huge betting on maa elections 2021
huge betting on maa elections 2021
huge betting on maa elections 2021

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)ఎన్నికలకు మరో మూడు రోజులు మాత్రమే ఉంది. అధ్యక్ష స్థానం కోసం పోటీ పడుతున్న మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానెల్ ల మధ్య నువ్వెంతంటే నువ్వెంత అన్నట్లుగా మాటల యుద్ధం జరుగుతోంది. ఓట్ల కోసం రెండు ప్యానెళ్ల సభ్యులు ఇప్పటికే ప్రచారం స్పీడ్ పెంచారు. ఐతే ఎన్నడూ లేని విధంగా వివాదమవుతున్న ఈ మా ఎన్నికలు ఎవరికీ లాభమో కానీ.. బెట్టింగ్ రాయుళ్ళకి మాత్రం ఒక రేంజిలో కలిసొస్తుందట. డీ అంటే డీ అంటూ కొట్టుకుంటున్న మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ఫైట్ తో ప్రజల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. దీన్నే బెట్టింగ్ రాయుళ్లు సరిగ్గా క్యాష్ చేసుకుంటూ.. పెద్దమొత్తంలో ఆర్గనైజ్డ్ బెట్టింగ్స్ కి తెరలేపుతున్నట్టు తెలుస్తుంది. లోకల్‌-నాన్‌లోకల్‌ ఇష్యూతో మొదలైన మా ఎన్నికల రచ్చ.. ఇప్పుడు ఓటుకి నోటు అంటూ విమర్శలు చేసుకునే వరకు వెళ్ళింది. మంచు విష్ణు పెద్ద ఎత్తున డబ్బులు పంచుతూ వృద్ధ కళాకారుల ఓట్లు కొంటున్నాడని ప్రకాష్ రాజ్ ప్యానెల్ వారు సంచలన ఆరోపణలు చేస్తున్నారు.

ఇక మెగా సపోర్ట్ తో ప్రకాష్ రాజ్, మోహన్ బాబు అండతో మంచు విష్ణులు జోడుగుర్రాల వలే పోటీకి దిగుతున్న వైనాన్ని మీడియా కూడా పెద్ద ఎత్తున చూపెడుతుండటంతో సామాన్యుల్లోనూ గెలుపు ఎవరిదో అనే ఆసక్తి నెలకొంది. ఒక వైపు హుజురాబాద్ ఎన్నికలు, మరోవైపు రసవత్తరంగా సాగుతున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచులని మించి మా ఎన్నికలపై బెట్టింగ్స్ జరుగుతున్నట్టు వార్తలొస్తున్నాయి. మా ఎలెక్షన్స్ లో ఎవరు గెలుస్తారనుకుంటున్నావ్ అని ఒకర్నొకరు అడగడంతో మొదలుపెట్టి… ఎంత పెడతావ్ అని లెక్కలేసేదాకా వెళ్లింది వ్యవహారం. కొన్నిచోట్ల ప్రైవేట్‌గా, మరికొన్నిచోట్ల ఆర్గనైజ్డ్‌గా బెట్టింగ్స్ జరుగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం వరకు బెట్టింగ్ రాయుళ్లు ప్రకాష్ రాజ్ వైపే ఎక్కువగా మొగ్గుచూపారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్న టాక్ వినిపిస్తోంది. మంచు విష్ణు అనూహ్యంగా పుంజుకుని ప్రకాష్ రాజ్‌తో ఢీ అంటే ఢీ అంటున్నాడు. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ మధ్య హోరాహోరీ ఖాయమన్న సమాచారంతో బెట్టింగ్ రాయుళ్లు కూడా తలలు పట్టుకుంటున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక ఆదివారం జరగబోయే ఎన్నికల సమయం వరకైతే బెట్టింగ్స్ పీక్స్ కి చేరే అవకాశాలున్నాయి.