ఉట్నూర్‌ మద్యం డిపోలో భారీ అగ్నిప్రమాదం.. రూ. కోట్లలో ఆస్తినష్టం

huge fire broke out

huge fire broke out at Utnoor liquor depot in Adilabad district

ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు మద్యం డిపోలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఉట్నూరు క్రాస్‌రోడ్డులోని ఐఎంఎల్‌డీ మద్యం డిపోలో మంటలు భారీగా చెలరేగాయి. క్రమంగా అవి డిపో మొత్తానికి విస్తరించాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. ప్రమాదంతో కోట్ల రూపాయల ఆస్తినష్టం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.