చెట్టు మీద భారీ కొండచిలువ.. తల పైకెత్తి చూస్తే గుండె గుభేల్.. వీడియో వైరల్ !

చెట్టు మీద వేలాడుతున్న పామును మీరెప్పుడైనా చూశారా.. మీరు రోడ్డు మీద నడుస్తూ వెల్లినపుడు చెట్టు మీద సడన్ గా పాము కనిపిస్తే హడలెత్తి పోతారు. బ్యాంకాక్‌లోని ఓ వీధిలో వాకింగ్ చేస్తున్న ప్రజలకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. బెంజసిరి పార్క్ మార్గంలో మార్నింగ్ వాక్ చేస్తున్న వారికి చెట్టు మీద 11 అడుగుల కొండచిలువ వేలాడుతూ కనిపించింది.

అది అంత ఎత్తులో ఉండడంతో ఎవరి మీదైనా పడుతుందేమోననే భయంతో కొందరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆ పామును పట్టుకొనేందుకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. చెట్టుకు ఎదురుగా ఉన్న భవనం మీదకు ఎక్కి ఆ పాము జాగ్రత్తగా పట్టుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.