‘ఆచార్య’ అభిమానులకు భారీ షాక్

acharya-movie

మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్‌ జంటగా న‌టిస్తున్న ఆచార్య.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విడుదలను వాయిదా వేసింది. ఈ మేరకు కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ అధికారికంగా ఆచార్య సినిమా విడుద‌ల వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టిస్తూ ట్వీట్ చేసింది. ఈ సినిమాలో కాజల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు.

ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్ర‌వ‌రి 4వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ క‌రోనా ఉధృతి దృష్ట్యా సినిమా విడుదలను వాయిదా వేశారు.

త్వ‌ర‌లోనే ఆచార్య విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తామ‌ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ వెల్ల‌డించింది. ప్ర‌తి ఒక్క‌రూ కొవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ విజ్ఞ‌ప్తి చేసింది.

దేశంలో ఓమిక్రాన్, కరోనా కేసులు పెరుగుతుండడంతో సంక్రాంతికి విడుదల కావాల్సిన భారీ బడ్జెట్ సినిమాలు వరుసగా వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాలు వాయిదా పడ్డాయి. ఆ జాబితాలో ఇప్పుడు ఆచార్య చేరింది.